AP Inter Hall Tickets : ఏపీలో ఏటా జరిగే ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు రాసేందుకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లలో హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ కళాశా ల్లో చదువుతున్న విద్యార్ధులకు నేరుగా కాలేజీల్లో నే హాల్ టికెట్లు అందిస్తుండగా.. ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులకు ఆన్ లైన్ లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచు తున్నారు.
ఆంధప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2024 హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు విజయవా డలో అధికారికంగా విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వీటిని విద్యార్ధులకు అందజేశారు. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.