అయితే ఈ టాప్ ప్రొడ్యూసర్ కారణంగా 2025లో హీరోల మధ్య ఫైట్ తప్పేలా లేదు. 2025 సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో నిలవబోతున్నాయి. ఇందులో మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర ఉండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి. ఇవే కాక బాలకృష్ణ సైతం బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడం సర్వసాధారణమే. అయితే ఇందులో రెండు సినిమాలు ఒకే నిర్మాతవి కావడం విశేషం. అటు రామ్ చరణ్, ఇటు విక్టరీ వెంకటేష్ సినిమాలకు ప్రొడ్యూసర్ దిల్ రాజే. డిస్ట్రిబ్యూషన్ రంగంలో పాతుకుపోయిన దిల్ రాజు ఈ సారి తన సినిమాలకు తప్ప మరో సినిమాకు థియేటర్లు ఇవ్వడనే టాక్ వినిపిస్తున్నది. గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సంక్రాంతికి బాలీవుడ్ లో పెద్ద సినిమాలులేకపోవడంతో జనవరి నెలను ఖాయం చేసుకున్నాడు దిల్ రాజు. ఇక టాలీవుడ్ కు సంక్రాంతికి పెద్ద సీజన్ కావడంతో విక్టరీ వెంకటేష్ సినిమాను కూడా జనవరిలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపు వారం వ్యవధిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో మెజార్టీ థియేటర్లను ఈ ఒక్క ప్రొడ్యూసరే కొట్టుకుపోవడం ఖాయమని టాలీవుడ్ లో చర్చ జరుగుతున్నది.
2023 రిపీట్.
2023 జనవరిలో ఒక్క రోజు తేడాలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ఒకే నిర్మాత ఇద్దరు అగ్రహీరోలతో సినిమాలు తీయగా, రెండు హిట్టయ్యాయి. అప్పుడు థియేటర్లన్నీ ఈ ఇద్దరికే కేటాయించారు. మరి ఇప్పుడు దిల్ రాజు కూడా అదే చేస్తాడనే టాక్ నడుస్తుంది. దీంతో మిగతా సినిమాలు వాయిదా వేసుకోక తప్పేలా లేదు.