JAISW News Telugu

Relationship : పెండ్లి కాకుండానే రిలేషన్ షిప్.. ఆ సీరియల్ నటీమణులు వీళ్లే..

Relationship

Relationship

Relationship : బుల్లితెర సీరియల్స్ కు మహిళా ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎంతో ఉంటుంది. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో నటీనటులు ఈ సీరియళ్లలో నటిస్తూ అలరిస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది పెండ్లి చేసుకోకుండా రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు.  ఇందులో కొందరి పేర్లు చూద్దాం..

కీర్తి, కార్తీక్
కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది కీర్తి భట్. ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం కీర్తి కార్తీక్ తోట అనే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న్లు తెలుస్తున్నది.

శోభా శెట్టి, యశ్వంత్
ఇక బుల్లితెర సీరియళ్లలో విశేష ఆదరణ పొందిన కార్తీక దీపం సీరియల్ లో మోనిత  గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. మోనితగా విలన్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటున్నది శోభా శెట్టి. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది. తన ప్రియుడు యశ్వంత్ తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. పెండ్లి కాకున్నా ఈ జంట కొత్త ఇంట్లో ఇప్పుడు సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
సిద్దుపవన్, సోనియా సింగ్- సిరి హన్మంతు, శ్రీహాన్
ఇక యూ ట్యూబ్ లో వెబ్ సిరీస్ ల ద్వారా ఆకట్టుకునే సిద్దు పవన్, సోనియా సింగ్ జంట కూడాకలిసి ఉంటున్నట్లు సమాచారం. మరోవైపు సిరి హన్మంతు, శ్రీహాన్ జంట కూడా పెండ్లి కాకుండానే కలిసి ఉంటున్నట్లు సమాచారం, వీరిద్దరు ఓ బాబు ను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారట కూడా.

ప్రియాంక జైన్, శివకుమార్
బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక జైన్ జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై తన ప్రతిభ చూపింది. సీరియల్ నటుడు శివకుమార్ తో ఈ అమ్మడు ఇప్పుడు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారిందని, పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తున్నది. రీసెంట్ గా ఒక కొత్త ఇల్లు తీసుకొని కలిసి ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Exit mobile version