Rekha Love Stories : అమితాబ్ కాకుండా.. రేఖ ఇంకా ఎంత మందితో లవ్‌లో పడిందో తెలుసా?

Rekha Love Stories

Rekha Love Stories

Rekha Love Stories : సినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఆడవాళ్లకి ఒకలా.. మగవాళ్లకి మరోలా ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల చేతుల్లోనే ఇండస్ట్రీ పగ్గాలు ఉంటాయి. ఎవరైనా ఒక అమ్మాయి.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే చాలా సమర్పించుకోవాల్సి ఉంటుంది. అన్నీ వదిలేసుకోవాల్సి ఉంటుంది. అందరూ అని చెప్పలేం కానీ.. ఇప్పటి వరకు స్టార్ స్టేటస్, ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న హీరోయిన్లు, కొత్తగా వస్తున్న వారు.. ఎక్కడో ఒక చోట తగ్గాల్సి ఉంటుంది తప్పదు. అందుకే అంటారు సినిమా ఇండస్ట్రీని రంగుల ప్రపంచం అని. ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి అవకాశాల కోసం వారంతట వారే లొంగిపోతే.. ఎలాగైనా లొంగదీసుకోవాలకునేది రెండో రకం. ఇంకా క్లారిటీ రావాలంటే విద్యాబాలన్ ‘డర్టీపిక్చర్’ సినిమా చూస్తే.. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సరే ఆ విషయం పక్కన పెడితే..

బాలీవుడ్ హీరోయిన్లలో ఎవర్‌గ్రీన్ తారగా పేరున్న నటి రేఖ. ఈ బ్యూటీ గురించి అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా అమితాబచ్చన్ విషయంలో రేఖ పేరు మాములుగా వినిపించలేదు. ఇప్పటికీ ఆ బంధంపై ఏదో ఒక చోట వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అమితాబచ్చన్ ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని ఒకసారి, అమితాబ్ వైఫ్ జయాబచ్చన్ ఆమెను కొట్టించి, బంధించి.. వెళ్లగొట్టిందని ఇలా చాలానే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే అమితాబచ్చన్ మాత్రమే కాకుండా.. రేఖకు మరో 15 మందితో లవ్ ఎఫైర్ ఉన్నట్లుగా రేఖ బయోగ్రఫీ రాసిన యాసర్ ఉస్మాన్ చెప్పడం.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Rekha Love Stories

Rekha Love Stories

‘రేఖ ద అన్ టోల్డ్ స్టోరీ’ పేరుతో యాసర్ ఉస్మాన్ రాసిన రేఖ బయోగ్రఫీలో ఆమె సుమారుగా 15 మందితో లవ్ ఎఫైర్ నడిపినట్లుగా పేర్కొన్నాడు. ఆ 15 మందిలో కొందరు పేర్లు కూడా రివీల్ చేశాడు. ఆయన చెప్పిన ప్రకారం రేఖ అమితాబ్ కంటే ముందే ఇద్దరి ప్రేమలో పడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ జితేంద్రతో ఆమె మొదట ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత విలన్ పాత్రలతో స్టార్ స్టేటస్ అందుకున్న జీవన్ కుమారుడు కిరణ్ కుమార్‌తో ఆమె కొంతకాలం రిలేషన్‌లో ఉంది. ఆ తర్వాతే అమితాబచ్చన్.

రేఖ ఎంతమందితో లవ్‌లో పడినప్పటికీ.. అమితాబచ్చన్ పేరు మాత్రమే ఆమె విషయంలో వినబడుతుంది.. హైలెట్‌గా చెప్పుకోబడుతుంది. ఎందుకంటే, బిగ్‌బి-రేఖల ప్రేమ వ్యవహారంలో జయాబచ్చన్ వ్యవహరించిన తీరు అలాంటిది మరి. జయాబచ్చన్‌ని అఫీషియల్‌గా పెళ్లి చేసుకున్నప్పటికీ అంతకంటే ముందే సీక్రెట్‌గా బిగ్‌బి-రేఖ‌ల పెళ్లి జరిగిందని బాలీవుడ్‌లో అనుకుంటూ ఉంటారు. జయాబచ్చన్ ఎంటరైన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అమితాబ్ తర్వాత రేఖ ప్రేమాయణం నడిపిన హీరో వినోద్ మెహ్రా. అప్పట్లో వినోద్ అందానికి అమ్మాయిలు ఫిదా అయిపోయేవారు. అలా రేఖ కూడా పడిపోయింది. అతన్ని పెళ్లి కూడా చేసుకుందనేలా వార్తలు వచ్చాయి కానీ.. ఎక్కడా వారిద్దరి విషయంలో ఆ ప్రస్తావన రాలేదు. వినోద్ తర్వాత రేఖ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఖల్‌ నాయక్ సంజయ్ దత్. అయితే అది కూడా మున్నాళ్ల ముచ్చటగానే ముగిసిందని అంటారు. సంజయ్ కోసమే ఆమె సింధూరం ధరించేదట.

సంజయ్ దత్‌తో ఎఫైర్ ముగిసిన అనంతరం.. రేఖ అఫీషియల్‌గా ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త ముఖేష్ అగర్వాల్‌ని పెళ్లాడింది. రేఖ అఫీషియల్‌గా పెళ్లి చేసుకున్న వారి లిస్ట్‌లో ముఖేష్ అగర్వాల్ పేరు మాత్రమే వినిపిస్తుంది. అయితే రేఖ వ్యవహారం తెలిసి ముఖేష్ బాగా డిజప్పాయింట్ అవడం, తరచూ వారిద్దరి మధ్య గొడవలు జరగడంతో.. ఇద్దరూ విడిపోయి, విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ విడిపోయిన 7 నెలలకే ముఖేష్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ముఖేష్ మరణానంతరం రేఖకు అక్షయ్ కుమార్‌‌కు మధ్య ప్రేమాయణం నడిచినట్లుగా వార్తలు వచ్చాయి. రవీనా టాండన్‌తో అక్షయ్ మ్యారేజ్ అయ్యే వరకు వారిద్దరూ ప్రేమను కొనసాగించారు. పెళ్లి అనంతరం రేఖ అతనికి దూరమైంది. ఇలా సుమారు 15 మందితో రేఖ ప్రేమాయణం నడిపిందని, అఫీషియల్‌గా మాత్రం ఆమె పెళ్లాడింది ముఖేష్ అగర్వాల్‌ని మాత్రమే అని ఆమె బయోగ్రఫీలో వెల్లడించారు.

TAGS