JAISW News Telugu

AP Volunteers : వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించండి : సీపీఎం

AP Volunteers

AP Volunteers, CPM Demands

AP Volunteers : గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని  రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.  ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థ నిష్పక్షపాతంగా పని చేయాలని వారు కోరారు.

గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ప్రధాన బాధ్యతలు అప్పగించరాదని ఎన్నికల కమీషన్‌ చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి ‘‘మీరే నా భావి లీడర్లు’’ అని సన్మాస సభలో వ్యాఖ్యానించడం అనుచితం అని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలు   ఓటర్లను ప్రలోభ పెట్టడాన్కి తప్ప మరొకటి కాదనీ, నిజంగా వాలంటీర్లపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలనీ డిమాండ్ చేశారు..

గ్రామ వాలంటీర్లుతో రాష్ట్ర ప్రభుత్వం నానా చాకిరీ చేయించుకుంటున్నదనీ వారు మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులతో వాలం టీర్లు దినదినగండంగా గడుపుతున్నారు. కానీ వారికి నామమాత్రమైన వేతనాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటుoదన్నారు. కాబట్టి వాలంటీర్లకు సన్మానాల పేరుతో వంచనకు గురిచేయరాదని, రాజకీయ ప్రయోజనానికి వాడుకోకుండా జీతాలు పెంచి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని సిపియం నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Exit mobile version