JAISW News Telugu

Reels : తిరుమలలో అన్యమత పాటలు పాడుతూ రీల్స్.. కేసు నమోదు

FacebookXLinkedinWhatsapp
Reels

Reels

Reels : తిరుమల పాపవినాశనంలోని రెండు హోటళ్ల మధ్య ఆదివారం ఇద్దరు మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం వివాదాస్పదమైంది. పాపవినాశనంలో హాకర్లుగా జీవనం సాగించే శంకరమ్మ, మీనాక్షిలు భక్తుల ముందే అన్యమత పాటలు పాడుతూ, ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ఈ విధంగా అన్యమత ప్రచారానికి తెగబడ్డారు. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిద్దరినీ కొండ నుంచి కిందకు తరలించారు. తిరుమల టూటౌన్ పోలీసులకు టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు శంకరమ్మ, మీనాక్షిలపై కేసు నమోదు చేశారు.

Exit mobile version