Gold Price Today : తగ్గిన బంగారం ధర..తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా..
Gold Price Today : గత రెండు వారాలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధర..కాస్త శాంతించింది. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన గోల్డ్ రేటు.. మంగళవారం స్వల్పంగా తగ్గింది. అయితే గత పదిరోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది.
ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయికి చేసిపోయింది. మరో వైపు వెండి ధర వరుసగా రెండో రోజు తగ్గింది. తాజాగా మంగళవారం కిలో వెండిపై రూ. 100 రూపాయలు తగ్గింది.
తెలుగురాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈ రోజు ఉదయం నమోదైన వివరాల ప్రకారం..హైదారాబాద్ ,విజయవాడ,విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,740 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 66,260 వద్ద కొనసాగుతుంది.