Red Snake : ప్రపంచంలో మనకు ఎన్నో రకాల వింత జీవులు కనిపిస్తాయి. ఒక జాతికి చెందిన జీవులే వందల రకాల్లో ఉంటాయి. పాముల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల రకాలు ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు. అయితే ఇవన్నీ విషపూరితం కాదని, వాటిలో కొన్ని మాత్రమే విషపూరితం అని అంటున్నారు. భారత్ లో 69 రకాల జాతుల పాములు అత్యంత విషపూరితమైనవని పరిశోధకులు పేర్కొంటున్నారు.
పాములంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భయమే. పులులు, సింహలు, ఏనుగులు కాక మనిషి భయపడే జీవి ఏదన్నా ఉందంటే అది పాము మాత్రమే. పాములు అడవుల్లోనే కాదు గ్రామాలు, పట్టణాలు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. ఇక పొలాల్లోనైతే రైతులకు వీటితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే 69 రకాల జాతుల్లో ఈ మధ్య కాలంలో ఓ అరుదైన జాతి పాము కొందరి కంటపడింది. ఇప్పుడు ఆ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించే ఆ పాము ఎరుపు రంగులో చిన్న పడగ విప్పి అందంగా కనిపిస్తోంది. అయితే ఇది చూసేందుకు ముద్దుగా ఉన్నా విషపూరితమైనదని చెబుతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఈ ఎరుపు రంగు పామును పట్టుకున్నాడు. ఆ పామును లాగగానే ఒక్కసారిగా పడగ విప్పింది. ఈ పాము పేరు రెడ్ స్పిటింగ్ కోబ్రా అని యానిమల్ డైవర్సిటీ నివేదికలో తెలిపారు. ఇది కేవలం ఆఫ్రికా ప్రాంతంలోనే కనిపిస్తుందట. దీని శాస్త్రీయ నామం నజా పల్లీడ. ఉగాండా, సూడాన్, ఈజిప్టు, టాంజానియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో @snake-friend అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.