Weather Alert : రికార్డు ఉష్ణోగ్రతలు.. బిగ్ అలర్ట్
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మండిపోతున్నాయి. పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల మొత్తం వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు.
బుధవారం పల్నాడు జిల్లా కొప్పునూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే కారణంగా పిల్లలు, గర్భిణిలు, వృద్ధులు బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.