BRS : బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటో తెలుసా?

BRS

BRS

BRS : తెలంగాణలో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కానీ అది అంత సులభం కాదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టినట్లుగా ఉంది. మాటమాటకు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇక్కడ కూడా కరెంట్ కష్టాలు తప్పవనే మాటలు తప్ప తామేమి చేస్తున్నామో వివరించడం లేదు. దీంతోనే బీఆర్ఎస్ కు ఇక మూడిందనే వాదనలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ నేతలకు అహంకార గర్వం పెరిగింది. ప్రతిపక్షాలు ఏది మాట్లాడినా దానిపై ఆగ్రహం వ్యక్తం చేయడం అలవాటు చేసుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రతిపక్షాల మాటలకు వక్రభాష్యం చెబుతూ దొరతనం ప్రదర్శిస్తున్నారు. అధికారం దక్కడానికి చెరో యాభై శాతం అవకాశాలున్నాయని కొన్ని సంస్థలు చెబుతుంటే కొన్ని మాత్రం కాంగ్రెస్ దే విజయం అని తేల్చుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ లో అంతర్మథనం మొదలైంది. ఓటమి భయం వెంటాడుతోంది. మూడో సారి అధికారం కలగానే మిగులుతోందని వాదనలు వస్తున్నాయి. వారి అహంకారమే వారి ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండోసారి అధికారం రాగానే వారి మాటల్లో తేడా కనిపించింది. వారి తలపొగరే వారికి నష్టం కలిగించేలా మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్నాళ్లు తమ కలల పంటగా చెప్పుకున్న వారి ఆశలు అడియాశలు చేసింది. అక్కడ వంగిన ఫిల్లర్ బీఆర్ఎస్ కు పెద్ద మచ్చ తీసుకొచ్చింది. దీనిపై వారి మాటలు కూడా అసహ్యంగా ఉన్నాయి. మనం ఇల్లు కట్టుకుంటే దోషాలు ఉండవా అని ప్రశ్నించి మరింత దిగజారిపోయారు. దానికి కారణాలేంటో తెలుసుకుని సరిచేస్తామనే మాటలు వారి నోటి నుంచి రాలేదు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు బీఆర్ఎస్ ఓటమి దాదాపు ఖరారైనట్లే అని సర్వేలు చెబుతున్నాయి. హంగ్ ఏర్పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. హంగ్ ఏర్పడితే తామే చక్రం తిప్పుతామని గులాబీ బాస్ ఆశలు పెంచుకుంటున్నారు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టున్నట్లుగా ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. ఇప్పుడు బీజేపీ ఎమ్మార్పీఎస్ ఓట్లు లాగేసుకోవడంతో ఇక బీఆర్ఎస్ కు చెక్ పెట్టడం ఖాయమనే తెలుస్తోంది.

TAGS