Curry & Cyanide : ఒకే మహిళ..6 హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రియల్ క్రైం స్టోరీ..

Curry & Cyanide

Curry & Cyanide Review

Curry & Cyanide : ఇటీవల కాలంలో రియల్ క్రైం స్టోరీలను బేస్ చేసుకుని సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వస్తున్నాయి. ఇక ఆ కోవలోనే వచ్చిన ‘కర్రీ అండ్ సైనేడ్’ డాక్యుమెంటరీ డిసెంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక రియల్ స్టోరీ. దీన్ని క్రిస్టో టామీ తెరకెక్కించాడు. కేరళలో జాలీ జోసఫ్ కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2022లో ఈ కేసు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఓ మహిళ తన కుటుంబ సభ్యులను హత్య చేసింది. కుటుంబ సభ్యుల ఆహారంలో సైనేడ్ కలుపుతూ ఈ హత్యలకు పాల్పడింది.

ఈ స్టోరీతో వచ్చిన ‘కర్రీ అండ్ సైనేడ్’ డాక్యుమెంటరీ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఆదికేశవ, జవాన్ ను అధిగమించి దేశంలో టాప్-3లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. ఇంతగా జనాలను ఆకట్టుకుంటున్న ఈ కథలో ఏముందో.. చూద్దాం..

కేరళలోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్ కు ఇదే ప్రాంతానికి చెందిన రాయ్ థామస్ తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారుతుంది. వీరు ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఆమె ఎంకామ్ చేసినట్టు చెప్పి రాయ్ థామస్ ను పెళ్లాడుతుంది. ఇక రాయ్ థామస్ తల్లిదండ్రులు(టామ్ థామస్, అన్నమ్మ థామస్) ఇద్దరు టీచర్లుగా పనిచేసి రిటైర్ అవుతారు. ఇంట్లో వాళ్లంతా చదువుకున్న వారు కావడంతో.. మహిళ తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో కోడలిని ఉద్యోగం చేయమని సూచిస్తుంది. కానీ జాలీకి ఉద్యోగం చేయడం ఇష్టముండదు. అత్తగారు పోరు పడలేక ఎన్ఐటీలో జాబ్ వచ్చిందని చెప్పి, రోజూ బయటకు వెళ్లి వచ్చేది. భర్త కుటుంబ ఆస్తి మీద కన్నేసిన జాలీ.. ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఈక్రమంలోనే సైనేడ్ హత్యలకు ప్లాన్ చేస్తుంది. 2002లో తన అత్త అన్నమ్మను..2008లో మామ టామ్ థామస్ ను, 2010లో భర్త రాయ్ థామస్ ను, ఆ తర్వాత 2012లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూను, 2016లో జూలీ రెండో భర్త అయిన షాజు భార్యను, ఏడాదిన్నర పాపను కిరాతకంగా చంపేస్తుంది. ఆమెను 2019లో పోలీసులు అరెస్ట్ చేశారు.

కుటుంబ సభ్యులను హత్య చేస్తున్నా ఎవరికీ తెలియలేదా.. జాలీపై అనుమానం రాలేదా.. ఆమెకు ఎవరైనా సాయం చేశారా? ఆమెకు ఏమైనా ఎఫైర్లు ఉన్నాయా? అని తెలుసుకోవాలంటే డాక్యుమెంటరీని చూడాల్సిందే.

TAGS