Lavanya Tripathi : నిహారిక కోసం ఫ్రీ గా అలాంటి పనులు చెయ్యడానికి సిద్ధం

Lavanya Tripathi

Lavanya Tripathi ready to do anything for niharika

Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ లోకి రీసెంట్ గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి పేరు గత కొంతకాలం గా సోషల్ మీడియా లో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే మంచి పాపులారిటీ ఉన్న లావణ్య త్రిపాఠి, మెగా ఫ్యామిలీ లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె గురించి మాట్లాడుకోవడం సహజమే. కానీ ఇప్పుడు ఆమె తనకి సంబంధించిన సినిమా విడుదల కాబోతుండడం తో ప్రొమోషన్స్ కారణంగా ఆమె పేరు ఇప్పుడు ఇంకా బలంగా వినిపిస్తుంది.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం పేరు ‘మిస్ పర్ఫెక్ట్’ . బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ హీరో గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీ నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న లావణ్య త్రిపాఠి నిహారిక కొణిదెల గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

యాంకర్ నిహారిక కొణిదెల గురించి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు మెగా కుటుంబం లోకి అడుగుపెట్టక ముందు నుండే నిహారిక మీకు మంచి స్నేహితురాలు కదా..కానీ మీరు తోడికోడలు కట్నం ఏమైనా ఇచ్చారా..?, ఇస్తే ఎంత ఇచ్చారు?’ అని అడుగుతుంది. దీనికి లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘నేను నిహారికకు ఎలాంటి కట్నం డబ్బులు ఇవ్వలేదు కానీ, దానికి బదులుగా ఆమె నిర్మాణ సంస్థ లో ఉచితంగా ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిహారిక కొణిదెల ముందుగా టాలీవుడ్ లోకి నాగబాబు కూతురుగా హీరోయిన్ గా అడుగుపెట్టింది.

కానీ సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడిన నిహారిక, అతనితో విడిపోయాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చైతన్య తో వైవాహిక బంధం లో ఉన్నప్పుడే పలు సినిమాలను నిర్మిస్తూ వచ్చిన నిహారిక, ఇప్పుడు దానిని కొనసాగిస్తూ వెళ్తుంది. రీసెంట్ గా అయితే ఆమె మళ్ళీ హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అయ్యింది. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

TAGS