Pushpa 3 : పుష్ప 3కి రంగం సిద్ధం.. అల్లు, సుక్కు ప్లాన్ మామూలుగా లేదుగా?

Pushpa 3

Pushpa 3 Plan

Pushpa 3 : అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ను మూడో భాగంతో పొడిగించబోతున్నట్లు కన్ఫర్మేషన్ రావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప: ది రైజ్’, ఆ తర్వాత సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ నేపథ్యంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

‘పుష్ప 3’ కోసం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఊహాగానాలు నిజమైతే రామ్ చరణ్ తో సుకుమార్ తన ప్రాజెక్ట్ (#RC17) పూర్తి చేసిన తర్వాత పుష్ప3కి వెళ్లే అవకాశం ఉంది.

‘పుష్ప3: ది రోర్’ అధ్యాయంగా పుష్ప ప్రయాణం ఉంటుందని ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఉటంకించిన ఇన్ సైడర్ ఫ్రాంచైజీ పంథాను వివరించారు. కోర్ కాన్సెప్ట్ ఫైనలైజ్ కాగా, పుష్ప 2కు లభించే ఆదరణపైనే స్క్రిప్ట్ డెవలప్ ఆధారపడి ఉంది. కేవలం సీక్వెల్ లో ముగించడం కంటే యూనివర్స్‌ను విస్తరించే అవకాశం రావడంతో చిత్రబృందం థ్రిల్ అవుతున్నట్లు సమాచారం.

గతంలో అల్లు అర్జున్ చేసిన ప్రకటనలు ఈ ఫ్రాంచైజీ కథను మలుపుతిప్పే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చాయి. మూడో భాగాన్ని ఆశించవచ్చని, దీన్ని ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని, లైనప్ కోసం తమ వద్ద కథలు సిద్ధంగా ఉన్నాయని ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. గేతేడాది అల్లు అర్జున్ చీరకట్టులో, ముఖాన్ని రంగులతో అలంకరించిన విలక్షణమైన లుక్ ను ఆవిష్కరించడం ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ పోస్టర్ అంచనాలను మరింత పెంచింది. రష్మిక మందన్న పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప చిత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉండడంతో పుష్ప 2: ది రూల్ 2024, ఆగస్టు 15 న విడుదల కానుంది.

TAGS