AR Dairy : తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. టీటీడీకీ సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ఎలాంటి న్యాయ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తామేం తప్పు చేయలేదని నిరూపించుకుంటామని చెప్పింది. జూన్, జులైలో టీటీడీకి పంపిన నెయ్యి అంతా అక్కడి అధికారులు తిరిగి పంపించేశారని తెలిపింది. క్వాలిటీ నెయ్యినే పంపించామని, టెస్ట్ చేశాకే లారీలు కంపెనీ నుంచి బయటకు వెళ్తాయని వివరించింది. టెస్టు రిపోర్టు కూడా లారీలతోనే టీటీడీకి పంపిస్తామని తెలిపింది.