Cameraman Gangatho Rambabu Vs Yatra 2 : 2019 వ సంవత్సరం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా జగన్ ని సీఎం చేసేందుకు ఒక మెట్టు గా ఉపయోగపడింది. అంతే కాకుండా అప్పట్లో వైసీపీ వేవ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణగా కూడా నిల్చింది ఈ చిత్రం. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘యాత్ర 2’ తెరకెక్కనుంది.
మొదటి భాగం మొత్తం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీస్తే, రెండవ భాగం మాత్రం సీఎం జగన్ మీద తీశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రం లో ఏర్పడిన పరిస్థితులు ఏమిటి?, జగన్ మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి అక్రమ కేసులు వేసి ఆయన్ని జైలుకు వెళ్లేలా చేసింది?, రాష్ట్రం వైసీపీ కి ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను మొత్తం ఎదురుకొని, జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనే దానిపై ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి పీ రాఘవ్.
ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో జగన్ పాత్రని ప్రముఖ తమిళ హీరో జీవా చెయ్యగా, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రని మమ్మూటీ పోషించాడు. ఫిబ్రవరి 8 వ తారీఖున ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి పోటీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం రీ రిలీజ్ కాబోతుంది. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా తీసుకొని పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిల్చింది.
కానీ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ‘యాత్ర 2 ‘ కౌంటర్ గా విడుదల చెయ్యబోతున్నాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్. అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలలో ఆడియన్స్ ఏ చిత్రానికి అయితే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తారో, వాళ్ళ వైపే రాబొయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.