JAISW News Telugu

RCB Vs CSK : ఆర్సీబీ ఫ్యాన్స్, స్టేడియం స్టాప్  అత్యుత్సాహం..  సీఎస్కే అభిమానులపై దాడులు

RCB Vs CSK

RCB Vs CSK

RCB Vs CSK : చెన్నై, ఆర్సీబీ మధ్య బెంగళూరులో జరిగిన కీలకపోరులో ఆర్సీబీ చెన్నైను ఓడించి ప్లే ఆప్స్ కు చేరుకుంది. ఏ మాత్రం ఆశలు లేని స్థితి నుంచి ప్లే ఆఫ్స్ కు చేరి అందరినీ ఆశ్యర్యపరిచింది. చెన్నై, ఆర్సీబీ మ్యాచులో దాదాపు 90 శాతం చెన్నైకే గెలుపు అవకాశాలు ఉన్న కూడా ఆర్సీబీ ప్లేయర్స్ సమష్టిగా రాణించి చెన్నైను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ప్లే ఆప్స్ కు అర్హత సాధించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 9 సార్లు ప్లే ఆప్స్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

మ్యాచ్ అనంతరం బెంగళూరు చిన్న స్వామి స్టేడియం నుంచి బయటకు వెళుతున్న సీఎస్కే అభిమానులపై ఆర్సీబీ అభిమానులు దాడులకు దిగారు. సీఎస్కే జెర్సీ వేసుకుని కనిపించిన ప్రతి ఒక్కరిని కొడుతూ, తిడుతూ దుర్భాషలాడుతూ నానా హంగామా చేశారు. అసలు ప్లే ఆప్స్ చేరినంత మాత్రానా ఇంత హంగామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం రోడ్లపైకి రావడంతో బెంగళూరులో ట్రాఫిక్ జాం అయిపోయింది.

ఆర్సీబీ ఫ్యాన్స్ దోని జెర్సీ 7 వేసుకున్న అభిమానిని పరుగెత్తించి దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎస్కే ఫ్యాన్స్ ను స్టేడియం బయట వెంటపడీ మరీ కొట్టడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు సీఎస్కే అభిమానులు పరుగులు తీశారు.  ఇదంతా ఒకెత్తు అయితే సీఎస్కే అభిమానులు ప్రదర్శిస్తున్న ప్లకార్డులను బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలోని స్టాప్ చేతుల్లోంచి లాగేసుకోవడం.. వారిని దూషించే వీడియో ప్రస్తుతం ట్విటర్ లో సీఎస్కే అభిమాని పోస్టు చేశాడు.

దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ పై సీఎస్కే అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క టైటిట్ కూడా గెలవని ఆర్సీబీ కేవలం ప్లే ఆఫ్స్ కు వెళితేనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు ఎలిమినేటర్ మ్యాచ్ చెన్నై లోనే ఉంది. అక్కడికి వచ్చే ఆర్సీబీ అభిమానులపై తమ ప్రతాపం చూపిస్తామని అంటున్నారు. మరి ఎలిమినేటర్ మ్యాచ్ ఏమో గానీ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకునే పరిస్థితి మాత్రం తప్పదనిపిస్తోంది.

Exit mobile version