RBI Guidelines : ఇక నుంచి ఖాతాలో నిల్వ లేకున్నా డబ్బు వాడుకోవచ్చు తెలుసా?

RBI Guidelines
RBI Guidelines : మనకు బ్యాంకులు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాయి. మన ఖాతాలో డబ్బు లేకపోయినా మనం డబ్బు పొందవచ్చు. మన ఖాతా నుంచి యూపీఐ ద్వారా డబ్బును తీసుకోవచ్చు. ఇది యాభై వేల వరకు ఉంటుంది. దీనికి గాను మనం తీసుకున్న డబ్బును 45 రోజుల్లో వెనక్కి కట్టేయాలి. ఆ లోపు ఎలాంటి వడ్డీ ఉండదు. ఆ సమయం దాటితే వడ్డీ పడుతుంది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు.
కొత్తగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం మనకు ఇలాంటి అవకాశం రావడంతో ఇక మీదట మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మన ఖాతాలో రూపాయి లేకున్నా ఇతరులకు డబ్బు పంపే వెసులుబాటు కల్పించింది. ఐసీఐసీఐ బ్యాంకు అయితే రూ.500 + వడ్డీ వసూలు చేస్తుంది. ఇలా మనకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఆర్బీఐ తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా ఓవర్ డ్రాఫ్ట్ లాంటి ఈ పథకం అందరికి ఉపయోగకరంగా ఉంది. డ్యురేషన్ చేసుకుంటే చాలు మనకు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎలాంటి వడ్డీ లేకుండా డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఖాతాదారులు మంచి ప్రయోజనాలు పొందే వీలుంటుంది.
ఇలా కొత్త కొత్త రకాల స్కీములు రావడం వల్ల ఖాతాదారులకు బ్యాంకు వ్యవహారాలు మరింత ప్రయోజనం కలిగించనున్నాయి. ఇలాంటి స్కీములు వాడుకుని తమ అవసరాలు తీర్చుకోవచ్చు. దీన్ని అందరు వాడుకుని తమ బ్యాంకులు అందిస్తున్న ఆఫర్లు వినియోగించుకోవాలని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో నగదు రహితంగా జరుపుకునే లావాదేవీలు వాడుకుంటే బాగుంటుంది.