RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన, చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఎసిడిటీతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆర్బీఐ అధికారి ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం శక్తికాంతదాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. మరో రెండు మూడు గంటల్లో ఆయన డిశ్చార్జి అవుతారని తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆస్పత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.