Prasadam : ప్రసాదాల కోసం వాడే ముడిసరకులు నాణ్యమైనవే.. ఫుడ్ లేబొరేటరీ నిర్ధారణ
prasadam : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారి నివేదనకు, ప్రసాదాల కోసం వాడే ముడి సరకులు నాణ్యమైనవేనని హైదరాబాద్ ఫుడ్ లెబొరేటరీ నిర్ధారించింది. తిరుమలలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో భద్రాచలం ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో) ఎల్ రమాదేవి అప్రమత్తమయ్యారు. భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరకుల నమూనాలను హైదరాబాద్ ఫుడ్ లేబొరేటరీకి పంపించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, పప్పు దినుసులు, బియ్యం అన్నీ నాణ్యమైనవేనని నిర్ధారించారు. ఈ మేరకు దేవస్థానానికి నివేదిక అందినట్లు ఈవో రమాదేవి తెలిపారు.