Ravindra Jadeja : టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించి సూపర్ 8 కు అర్హత సాధించింది. టీం సమిష్టిగా ఆడుతున్నప్పటికీ చాలా మంది ప్లేయర్లు ఇంకా రాణించడం లేదు. మూడు మ్యాచుల్లో టీం ఇండియాలో ఉన్న రవీంద్ర జడేజా పరిస్థితి అయితే మరోలా ఉంది. అసలు టీం లో ఉన్నాడో లేడోననే సందేహం కలుగుతుంది.
టీం ఇండియా ఆడిన ఐర్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో బౌలింగ్ చేసిన జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగిన జడ్డు.. మొదటి బంతికే సునాయస క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మూడో మ్యాచ్ లో టీం లో ఉన్నా కూడా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి బౌలింగే ఇవ్వలేదు. దీంతో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో సున్నా పరుగులు, సున్నా వికెట్లతో ఎలాంటి ప్రయోజనం లేకుండా మిగిలాడు.
కనీసం ఫీల్డింగ్ లో ఒక్క క్యాచ్ కూడా అందుకోలేక చతికిలపడ్డాడు. అయితే జట్టు యాజమాన్యం జడ్డూను కాకుండా మరో ఓపెనర్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ను తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యశస్వి ఓపెనింగ్ చేస్తే వన్ డౌన్ లో వచ్చే కొహ్లి తనకిష్టమైన స్థానంలో మెరుగ్గా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.
విరాట్ కొహ్లి కూడా మొదటి మ్యాచ్ లో నాలుగు, రెండో మ్యాచ్ లో ఒక్క పరుగు, మూడో మ్యాచ్ లో సున్నా పరుగులకే ఔట్ అయి జట్టుకు భారంగా మారుతున్నాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన విరాట్ టీ 20 వరల్డ్ కప్ కు వచ్చే సరికి ఎందుకు ఇలా ఆడుతున్నాడో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. జడ్డూ ను ఒక వేళ ఆడితే బ్యాటింగ్ లో ప్రమోషన్ ఇచ్చి పరీక్షించాలని కోరుతున్నారు. అప్పుడు ఆడాడా సరే లేకుంటే కచ్చితంగా పక్కన పెట్టాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది.