Kavya Thapar : సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లు పార్టీలకు పబ్బులకు వెళ్లడం సర్వసాధారణం. ఒకప్పుడు మనం అమ్మాయిలు కూడా మందు సిగరెట్ లాంటివి తాగుతారా అంటే ఆశ్చర్యపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్న సమాజం లో అది చాలా కామన్ అయిపోయింది. ఎవరి ఇష్టం వారిది, సమాజం లో ఆడవాళ్ళూ, మగవాళ్ళు సరి సమానం అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్లిపోతున్నారు మన పెద్దలు కూడా.
అయితే మందు తాగడం తప్పేమి కాదు, కానీ తాగిన తర్వాత ఎలా ప్రవర్తించారు అనే దానిపైనే ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. గతం లో కావ్య థాపర్ అనే యంగ్ హీరోయిన్ మందు తాగి ముంబై వీధుల్లో చేసిన రచ్చని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. తాగి బండి నడపడం అనేది చాలా తప్పు. దీనికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు, రాజకీయ నాయకులను సైతం విడిచిపెట్టని సందర్భాలు చాలానే ఉన్నాయి గతంలో. కానీ వాళ్లంతా తప్పు చేశారు కాబట్టి తలవంచుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కౌన్సెలింగ్ తీసుకున్నారు.
కానీ కావ్య థాపర్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. అసలు విషయం లోకి వెళ్తే 2022 వ సంవత్సరం లో హీరోయిన్ కావ్య థాపర్ మద్యం సేవించి కారు ని తోలుకుంటూ వచ్చి ఇద్దరినీ గుద్దేసింది. ఒకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది గమనించిన పోలీసులు వెంటనే కావ్య థాపర్ ని కార్ నుండి బయటకి తీసుకొచ్చారు. తనను ముట్టుకున్నందుకు ఆగ్రహించిన కావ్య థాపర్ పోలీసులను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడింది. అప్పుడు ఆమె మీదకు వచ్చిన లేడీ కానిస్టేబుల్ చొక్కా కాలర్ ని పట్టుకుంది. దీంతో కావ్య థాపర్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ ఘటన అప్పట్లో పెను దుమారమే రేపింది.
ఆమె అదృష్టం బాగుండడం వల్ల ఆమె చేసిన యాక్సిడెంట్ కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. లేకుంటే అమ్మడు ఇంకా జైలులోనే జీవితం గడుపుతూ ఉండేది. కావ్య థాపర్ ఈరోజు విడుదలైన మాస్ మహారాజ రవితేజ ఈగల్ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు ఆమె బిచ్చగాడు 2 , మిడిల్ క్లాస్ లవ్, ఏక్ మినీ కథ , ఈ మాయ పేరేమిటో వంటి సినిమాల్లో నటించింది. ఆమె హీరోయిన్ గా నటించిన మరో చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’ ఈ నెల 16 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది.