Prashant Neil : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై నోరు జారిన రవితేజ.. సారీ కూడా చెప్పలే.. వీడియో వైరల్
సలార్-2 ఇప్పటికే సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. అదే సమయంలో కేజీఎఫ్ -3 కూడా ఉంటుందని ప్రకటించాడు. ఈ మూడు సినిమాలు పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ మళ్లీ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం తేలనుంది.
ఇక టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై నోరు జారాడు. అదే ఎక్కడో కాదు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో. ఈ ప్రమోషన్ వీడియలో దర్శకుడు హరీశ్ శంకర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ గురించి చర్చించాడు. కేజీఎఫ్ లో వయోలెన్స్ ఎక్కువైందని కొందరు ప్రశాంత్ ను ప్రశ్నించగా, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తాము సినిమా తీయలేదని నీల్ సమాధానమిచ్చాడంటూ హరీశ్ చెప్పాడు. అంతలోనే రవితేజ కలుగజేసుకొని ప్రశాంత్ గురించి వాడు ఏదనుకున్నాడో అదే తీశాడు అన్నాడు. మళ్లీ అంతలోనే ఆయన అని సంబోధించాడు. కానీ వాడు అన్న దానికి మాత్రం సారీ అని చెప్పలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చిన రవితేజ ఓ డైరెక్టర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.ఏదో ఫ్లో లో వచ్చినా ఆ తర్వాత సారీ చెప్పాలనే సంస్కారం లేదా అని మండిపడుతున్నారు..