Ravi Teja : క్రేజీ మల్టీస్టారర్ నుండి రవితేజ అవుట్..రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న రవితేజ!

Ravi Teja

Ravi Teja

Ravi Teja : ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే హీరోలలో ఒకడు మాస్ మహారాజ రవితేజ. ముఖ్యంగా కొత్త దర్శకులతో సినిమాలు చెయ్యడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈయన వల్ల ఇండస్ట్రీ కి ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ పరిచయం అయ్యారు కానీ, రవితేజ కి అత్యధిక ఫ్లాప్స్ వచ్చింది కొత్త దర్శకుల వల్లే. ఇకపోతే రీసెంట్ గా ఆయన కార్తీక్ ఘట్టమనేని అనే దర్శకుడితో ‘ఈగల్’ అనే సినిమాని చేసాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ఈ సినిమాని విడుదల చెయ్యాల్సి ఉండగా, థియేటర్స్ సమస్య కారణంగా ఫిబ్రవరి 9 వ తేదికి వాయిదా పడింది. ఈ సినిమా లో కార్తీక్ ఘట్టమనేని పని తీరు నచ్చి అతనితో మరో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. కానీ హీరో గా మాత్రం కాదు, ఒక ప్రత్యేక పాత్రలో. తేజ సజ్జల ఈ చిత్రం లో హీరోగా నటిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది.

మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించబోతున్నాడు. అతి త్వరలోనే ప్రారంభం అవ్వబొయ్యే ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పుడు రవితేజ తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలోకి ఆ ప్రత్యేక పాత్ర ఇప్పుడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నట్టు సమాచారం. రవితేజ తో ఈమధ్య నిర్మాతలకు రెమ్యూనరేషన్ విషయం లో గొడవలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకి ఆయన 20 కోట్ల రూపాయలకు తక్కువ అడగడం లేదు. ఒకప్పుడు అయితే రవితేజ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడేవారు నిర్మాతలు. ఎందుకంటే అప్పట్లో డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ రికార్డు ప్రైజ్ కి అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ స్టార్ హీరోలకు బాగా తగ్గిపోయాయి, అందుకే రవితేజ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధం గా లేరు.

ఇక రీసెంట్ గా ఆయన ఒప్పుకున్న ఈ ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా 10 కోట్ల రూపాయిలు డిమాండ్ చేసాడట. మేకర్స్ కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసినప్పటికీ రవితేజ ఒప్పుకోలేదట. దీంతో ఆయన్ని ఈ సినిమా నుండి తప్పించి, దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నట్టు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే తేజ సజ్జల – మంచు మనోజ్ – దుల్కర్ సల్మాన్ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ నెలలో మొదలయ్యే అవకాశం ఉందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

TAGS