Ravi Teja Eagle : ఒకప్పుడు మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే బయ్యర్స్ కి మినిమం గ్యారంటీ సినిమా లాగా. టాక్ తో సంబంధం లేకుండా కనీస స్థాయి వసూళ్లను రాబట్టేవి రవితేజ సినిమాలు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని చెత్త సినిమాల కారణంగా ఆయన మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఆరు సినిమాలు తీస్తే, అందులో కేవలం ఒక్కటే మంచి సినిమా తీస్తున్నాడు. మిగతావి మొత్తం చెత్తవే ఉంటున్నాయి, కానీ హిట్ అయ్యినప్పుడు మాత్రం చాలా బలమైన వసూళ్లనే కొల్లగొడుతున్నాడు.
ఇది ఇలా ఉండగా ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ వరుసగా ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు తీసాడు. ఈ చిత్రాల తర్వాత ఆయన చేసిన ‘ఈగల్’ చిత్రం ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ థియేటర్స్ సమస్య కారణంగా ఫిబ్రవరి 9 కి వాయిదా పడింది.
అయితే ఈ సినిమా అలా వాయిదా పడడానికి కారణం కేవలం థియేటర్స్ సమస్య ఉండడం వల్ల మాత్రమే కాదు, సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోకపోవడం వల్లే ఈ సినిమా వాయిదా పడిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఒకప్పుడు ఉన్న రేంజ్ లో ఇప్పుడు డిజిటల్, సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం కష్టం అయ్యిందట. అందుకు కారణం ఓటీటీ సంస్థల బిజినెస్ డౌన్ అవ్వడం వల్లే అట. అందుకే రవితేజ రేంజ్ హీరోలకు రెమ్యూనరేషన్స్ కూడా ఒకప్పుడు ఇచ్చే రేంజ్ లో ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నారు. డిజిటల్, సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదని ఫిబ్రవరి 9 కి ఈగల్ ని వాయిదా వేస్తే, ఇప్పటికీ కూడా ఆ సినిమా రైట్స్ అమ్ముడుపోలేదట.
దీంతో నిర్మాత విశ్వ ప్రసాద్ రైట్స్ అమ్ముడుపోయే వరకు థియేట్రికల్ రిలీజ్ ఉండబోదని తన బయ్యర్స్ కి సమాచారం అందించాడట. పాపం రవితేజ లాంటి స్టార్ సినిమాకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సినిమా విడుదలై ఒకవేళ టాక్ బాగాలేకపోతే డిజిటల్+ సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవు అనేది నిర్మాత భయం. అందుకే ఇలా చేస్తున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనుంది.