Ravi Teja Eagle : మాస్ మహరాజ్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న రవితేజ మార్కెట్ రాను రాను పడిపోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ప్రదర్శనతో సంబంధం లేకుండా రవితేజ గతంలో అధిక రెమ్యునరేషన్ తీసుకునేవాడు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ తో సహా నాన్ థియేట్రికల్ మార్కెట్ బలంగా ఉండడంతో నిర్మాతలకు ఆ సమయంలో భారీగానే లాభాలు వచ్చేవి.
ఈ మధ్య కాలంలో అన్ని సినిమాల శాటిలైట్ రైట్స్ గణనీయంగా తగ్గాయి. హిందీ డబ్బింగ్ ఇండస్ట్రీ పూర్తిగా కుదేలైంది. రవితేజ ఓటీటీ కంపెనీలకు ఎప్పుడూ ఫెవరేట్ కాకపోవడంతో నాన్ థియేట్రికల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఆయన సినిమాల నిర్మాతలు ఇప్పుడు బడ్జెట్ గురించి, పెట్టిన పెట్టుబడిపై రాబడి గురించి ఆందోళన చెందుతున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నారని, వారితో తనకు ప్రత్యేక అనుంబంధం ఉందని చెప్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే రవితేజ రీసెంట్ ఫిలి ‘ఈగిల్’. ఈ మూవీని సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాతలు, రవితేజ విపరీతంగా ప్రయత్నించారు. ఈ సంక్రాంతికి స్టార్ హీరో మహేశ్ బాబు సినిమా గుంటూరు కారంను దిల్ రాజు ప్రత్యేకంగా తీసుకున్నారు. దీనికి తోడు హను-మాన్ కూడా విపరీతమైన బజ్ తో ఉంది. ఇక మరో సినిమా న సామిరంగ కూడా బరిలో ఉండడంతో రవితేజ కొంచెం వెనక్కి తగ్గాడు.
ఫిబ్రవరి ఎండింగ్ లో లేదంటే మార్చి ఫస్ట్ వీక్ లో థియేటర్ రిలీజ్ కు మేకర్స్, రవితేజ అంగీకరించారు. దీంతో ప్రొడ్యూసర్ గిల్డ్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఏదేమైనా, అతను ప్రస్తుతం ‘ఈగిల్’ విడుదల తరువాత తన నాన్-థియేట్రికల్ మార్కెట్ ను పునరుద్ధరించుకోవడం, విస్తరించడంపై అన్వేషిస్తున్నాడు.