JAISW News Telugu

Ravi Prakash : బీఆర్ఎస్ భవిష్యత్ పై రవి ప్రకాశ్ షాకింగ్ టాక్..

Ravi Prakash

Ravi Prakash

Ravi Prakash : మరో పది రోజుల్లో తెలంగాణలో లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రముఖ టీవీ ఛానల్ సీఈవో జోష్యం చెప్పారు.

న్యూస్ యాంకర్, జర్నలిస్ట్, టీవీ9 వ్యవస్థాపక సీఈవో రవిప్రకాశ్ ఈ విషయాన్ని అంచనా వేశారు. గతేడాది తాను ప్రారంభించిన డిజిటల్ టెలివిజన్ ఛానల్ ఆర్టీవీలో చాలా కాలం తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించిన రవిప్రకాశ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తిరుగులేనిదిగా పుంజుకుంటుందని, రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గానూ 8 స్థానాలను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. 2019లో మూడు స్థానాలున్న కాంగ్రెస్ 2024లో 8 స్థానాలకు ఎగబాకనుందని కూడా వివరించారు.

దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 స్థానాలను పంచుకోనుండగా, మిగిలిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం నాయకుడు, అధినేత అసదుద్దీన్ ఒవైసీకి దక్కుతుందని చెప్పారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ వంటి కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అవబోతుందని, ఒక్క సీటును కూడా గెలుచుకోలేదని వివరించారు.

సికింద్రాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో బీజేపీ విజయం సాధిస్తుందని రవిప్రకాశ్ వివరించారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని రవిప్రకాశ్ జోస్యం చెప్పారు.

రవి ప్రకాశ్ ప్రిడిక్షన్ తో తెలంగాణలోని బీఆర్ఎస్ శ్రేణులు మరింత గందరగోళంలో పడ్డాయి. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ర్యాలీలు, సభలు, సమావేశాల్లో విరివిగా పాల్గొంటున్నా..నైరాశ్యంలో శ్రేణులు ఉన్నాయని తెలుస్తోంది. 

Exit mobile version