Banglore Rave Party : కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. ఎలక్ట్రానికి సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం రాత్రి దాటిన తర్వాత ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఏపీ, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్టీలో డ్రగ్స్ వాడినట్లు గుర్తించి సీజ్ చేశారు.17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న బెంజ్ కారు సైతం ఉన్నట్లు సమాచారం. పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.