Rave party case : రేవ్ పార్టీ కేసు: విచారణకు దూరంగా హేమ

Rave party case

Rave party case

Rave party case : బెంగళూర్ రేవ్ పార్టీ దుమారం అంతా తెలుగు రాష్ట్రాల్లో హేమ చుట్టూనే తిరుగుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న హేమ చాలా ఫేమస్ కాబట్టి ఆమె చుట్టూనే తిరుగుతుంది.

ఈ పార్టీలో హేమ ప్రమేయాన్ని ఇప్పటికే నగర పోలీసులు ధృవీకరించారని, ఆమె రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల వినియోగం పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. వెంటనే సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హేమకు నోటీసులు పంపి ఈ రోజు (మే 27) విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. హేమతో పాటు మరో ఏడుగురిని ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

అయితే విచారణ నుంచి తప్పించుకున్న హేమ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, మరి కొంత సమయం కావాలని పోలీసులకు లేఖ రాసింది. త్వరలోనే ఆమెకు పోలీసులు మళ్లీ నోటీసులు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. గత వారం ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీని బెంగళూరు పోలీసులు ఛేదించారు. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో హేమ కూడా ఒకరు. ఈ కార్యక్రమంలో కొకైన్, ఎండీఎంఏ సహా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే తాను తన ఫామ్హౌస్లో ఉన్నానని, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరుకాలేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. ఒక్కరోజులోనే ఆమె ప్రమేయాన్ని పోలీసులు ధృవీకరించడంతో బెంగళూరుకు ఆమె విమాన టిక్కెట్లు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సీసీబీ నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే ఈ రోజు హేమ విచారణకు గైర్హాజరు కావడంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆమె మరో ‘కథ’తో ముందుకొచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

TAGS