Rave Party Case : రేవ్ పార్టీ కేసు.. ఏపీ మంత్రి కాకాణి అనుచరుడి అరెస్టు

Rave Party Case

Banglore Rave Party Case

Rave Party Case : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్ ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్ లో నివసించే పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన మంత్రి అనుచరుడని, రేవ్ పార్టీ ఏర్పాటులో ఆయనది ముఖ్య పాత్ర అని పోలీసులు ధ్రువీకరించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో పాల్గొన్న సినీనటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు.

TAGS