JAISW News Telugu

Rathika Comments Prashant : మళ్ళీ నోరుజారిన రతికా.. ప్రశాంత్ పై అలాంటి కామెంట్స్.. ఎవిక్షన్ పాస్ సాధించిన అర్జున్.. 

Rathika Comments Prashant

Rathika Comments Prashant

Rathika Comments Prashant : అక్కినేని కింగ్ నాగార్జున ప్రజెంట్ హోస్ట్ గా చేస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు.. ఈ సీజన్ గత సీజన్ తో పోలిస్తే హిట్ అనే చెప్పాలి.. ఇప్పటికే ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 10 వారాలు ముగిసింది.. 11వ వారం లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది..

ఈ వారం అప్పుడే నామినేషన్స్ ముగిసాయి.. ఇక నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్ లో 10 మంది హౌస్ మేట్స్ ఉండగా టాప్ 1 నుండి 10 వరకు ఎవరు ఉన్నారో ర్యాంకులు పెట్టారు.. నిన్నటి ఈ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. ఏ ర్యాంకుకు ఎవరు అర్హులో నిర్ణయించాలని బిగ్ బాస్ చెప్పాడు.

అయితే ముందుగా రతికా నేను 5వ స్థానానికి అర్హురాలిని అంటూ చెప్పుకుంది.. కానీ ఇంటి సభ్యులు మొత్తం ఓటింగ్ ప్రకారం ఈమెకు 10వ రాంక్ ఇచ్చారు.  మరి హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఏ రాంక్ లో నిలిచారు అంటే.. అందరు కలిసి అశ్వినికి 9వ రాంక్ ఇచ్చారు.. శోభా శెట్టికి 5వ రాంక్ ఇవ్వగా అర్జున్ అందుకు విభేదించాడు.

ఆమెకు 7వ రాంక్ అయితే సరిపోతుందని.. ఏదో అదృష్టం కొద్దీ ఈమె లక్ తో నెట్టుకు వస్తుంది అని చెప్పగా శోభా నా కష్టాన్నే లక్ అనే చిన్న మాటతో తీసిపడేసాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ప్రియాంకకు 4వ రాంక్ ఇచ్చారు.. అలాగే అమర్ దీప్ కు 6వ రాంక్, పల్లవి ప్రశాంత్ కు 3వ రాంక్ దక్కాయి..

శివాజీకి టాప్ 1 రాంక్ ఇచ్చారు.. యావర్ 2, అర్జున్ 8, గౌతమ్ 7 ర్యాంక్స్ అందుకున్నారు.. అయితే ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.. బాటమ్ 5 లో ఉండే వారు ఏవిక్షన్ పాస్ గెలుచుకునే అవకాశం ఇచ్చాడు. మరి బిగ్ చెప్పిన లెక్క ప్రకారం రతికా, అశ్విని, అర్జున్, గౌతమ్, అమర్ దీప్ లు ఎవిక్షన్ పోటీలో నిలిచారు.

ఏవిక్షన్ అని రాసి ఉన్న బ్రిక్స్ ను సెట్ చేసుకుని  కరెక్ట్ గా గంట మోగించిన వారిని విజేతలుగా ప్రకటిస్తానని బిగ్ బాస్ చెప్పగా ఇందులో అర్జున్ విన్ అయ్యి ఎవిక్షన్ సంపాదించాడు.. ఇదిలా ఉండగా ప్రశాంత్ గురించి రతికా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.. ప్రశాంత్ ముందు నాలుగు వారాలు పెద్దగా పీకింది ఏమీ లేదని.. నా వల్లనే అతడికి కలిసి వచ్చింది అని కామెంట్స్ చేయగా ప్రశాంత్ కూడా ఘాటుగా స్పందించాడు.

Exit mobile version