Ratan Tata : రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి

Ratan Tata
Ratan Tata : పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్ సీపీఏ గ్రౌండ్ కు తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం అక్కడ నుంచి వర్లీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. వర్లీ శ్మశాన వాటికలో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.