Noel Tata : దేశంలో అత్యంత ముఖ్యమైన దాతృత్వ సంస్థలలో ఒకటైన టాటా ట్రస్ట్ ల కొత్త ఛైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు. ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
నోయెల్ టాటా, రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. ప్రస్తుతం ఈయన టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వోల్టాస్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్ గా ఉన్న ఆయన.. టాటా స్టీల్, టైటాన్ కు వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు.