JAISW News Telugu

Ratan Tata : కంపెనీ ఉద్యోగుల కోసం గ్యాంగ్‌స్టర్ తో పోరాడిన రతన్ టాటా!

Ratan Tata

Ratan Tata

Ratan Tata : టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోని పురాతన వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన పేరు రతన్ టాటా. వ్యాపార రంగంలోనే కాకుండా దేశంలోని అన్ని వయసుల వారికి తన కంపెనీనీ పరిచయం చేసిన కార్పొరేట్ దిగ్గజంగా నిలిచారు. రతన్ టాటా కార్పొరేట్ దిగ్గజమే కాదు పరోపకారి కూడా. రతన్ టాటా తన కంపెనీ ఎదుగుదలకు ఎంతగా శ్రమించాడో అందులో పని చేసే ఉద్యోగుల సంక్షేమం కోసం  అంతే పరితపించారు. ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగానే  భావించాడు. ఇక తన టాటా మోటార్స్ ఉద్యోగుల విషయంలో ఓ సారిగ్యాంగ్‌స్టర్లతో కూడా పోరాడాడు.

టాటా మోటార్స్ వ్యాపారాన్ని గ్యాంగ్‌స్టర్లు దెబ్బతీయాలని చూశారని ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా స్వయంగా వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ టాటా మోటార్స్ ఉద్యోగులపై దాడి చేసి బెదిరించేవాడని పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్‌ను అడ్డుకునేందుకు రతన్ టాటా స్వయంగా రంగంలోకి దిగారు. టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల్లోనే టాటా మోటార్స్‌లో కలకలం రేగిందని గుర్తు చేసుకున్నారు. దీంతో అక్కడ పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ సంఘటన 1980లో జరిగింది.

పని మానేసిన ఉద్యోగులు
2015 లో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  అందులో  టాటా తన ఇంటర్వ్యూలో జరిగిన సంఘటన మొత్తం వెల్లడించారు. ఓ గ్యాంగ్‌స్టర్‌ తన  టాటా మోటార్స్‌ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు. అతను టాటా మోటార్స్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశాడు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దాదాపు 2000 మంది కంపెనీ ఉద్యోగులను తన వెంట తీసుకెళ్లాడు. విభజన,  బెదిరింపులకు పాల్పడ్డాడు. గ్యాంగ్‌స్టర్ టాటా మోటార్స్ ఉద్యోగులపై దాడి చేసి, అక్కడ పని చేయడం వెంటనే ఆపాలని బెదిరించేవాడు. గూండాల భయంతో మిగతా ఉద్యోగులు ప్లాంట్ కు రాడం మానేశారు. గ్యాంగ్‌స్టర్ టాటా మోటార్స్ యూనియన్‌ను స్వాధీనం చేసుకోవాలని,  కంపెనీలో ఉద్యోగులు సమ్మె బాట పట్టేలా చేయాలనుకుకున్నాడు. కానీ రతన్ టాటా దీనిని గుర్తించి అడ్డుకట్ట వేశాడు.

ప్లాంట్ లోనే రతన్ టాటా  
అప్పుడు రతన్ టాటా స్వయంగా ప్లాంట్ కు  చేరుకున్నారు. చాలా రోజులు అక్కడే ఉన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉద్యోగులను ప్రోత్సహిస్తూ, మళ్లీ పని ప్రారంభించేలా వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడ. రతన్ టాటా ప్రయత్నాలతో గ్యాంగ్ స్టర్ చిక్కాడు. అనంతరం మళ్లీ ప్లాంట్‌లో పనులు ప్రారంభమయ్యాయి. దీంతో టాటాలో కంపెనీ, ఉద్యోగుల మధ్య బలమైన సంబంధాలకు కొత్త నాంది కూడా మొదలైంది.
Exit mobile version