Ratan Tata : సక్సెస్ ఫుల్ కార్పొరేట్ దిగ్గజానికి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ !

Ratan Tata

Ratan Tata

Ratan Tata Love Story : ప్రపంచానికి వీడ్కోలు పలికిన రతన్ టాటా మాత్రం దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ప్రపంచ దిగ్గజ వ్యాపర వేత్త రతన్ టాటా. వ్యాపారంతో పాటు దేశం పట్ల తన బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు. ఎన్నో విజయాలను వ్యాపార చరిత్ర పేజీలో లిఖించుకున్న టాటా రతన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓ ఫెయిల్యూర్ ను మూటగట్టుకున్నాడు.

రతన్ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం అందిరికీ తెలిసిందే. కానీ తన చివరి రోజు వరకూ దేశం, ఇతరుల పురోగతి గురించి  ఆలోచనలు చేశాడు. భారతదేశ ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా ఆయన జీవితం ఎంతో ఆదర్శం. అతను తన తెలివితేటలతో టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి  తీసుకెళ్లాడు. నేటికీ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కంపెనీలను కలిగి ఉన్న గ్రూప్‌గా టాటా గ్రూప్ నిలిచింది. టాటా గ్రూప్ చాలా పెద్దది. ఉప్పు నుంచి ఓడల వరకు ప్రతీ వ్యాపారంలో పై చేయి సాధించింది. రతన్ టాటా తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ పురస్కారాలు కూడా పొందారు. ఆయనకు ఓ విఫల ప్రేమగాథ ఉన్నది. ఈ విషయాన్ని ఓసారి ఆయనే స్వయంగా వెల్లడించారు.

రతన్ టాటాను ఎల్లప్పుడూ తన విఫల ప్రేమగాథ నొప్పించేంది. తన మేనేజర్ శంతను స్టార్టప్ గుడ్‌ఫెలోస్ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రేమ గాథను వెల్లడించాడు. ‘ఒంటరిగా జీవించడం ఎలా ఉంటుందో మీకు తెలియదా? మీరు ఒంటరిగా సమయం గడపాల్సి వచ్చే వరకు మీరు దీనిని గ్రహించలేరుని

ప్రేమలో పడ్డాడు.. కానీ పెళ్లి చేసుకోలేకపోయాడు..

రతన్ టాటాకు వివాహం కాలేదు, కానీ అతనికి కూడా ఒక ప్రేమ కథ ఉంది.  కానీ ఈ ప్రేమ అసంపూర్ణంగా మిగిలిపోయింది. రతన్ టాటా లాస్ ఏంజిల్స్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కానీ అతను ఆ అమ్మాయిని పెళ్లి  చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. తనతో పాటు తాను ప్రేమించిన అమ్మాయి కూడా ఇండియాకు వస్తుందని రతన్ టాటా భావించారు. రతన్ టాటా చెప్పిన వివరాల ప్రకారం ‘1962 నాటి ఇండియా-చైనా యుద్ధం కారణంగా తాను ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులు ఇండియాకు రావడానికి ఇష్టపడలేదు. దీంతో వారి ప్రేమ బంధం అక్కడితో ముగిసిపోయింది.

ఎంతో మందికి స్ఫూర్తికి  రతన్ టాటా..

రతన్ టాటా కేవలం వ్యాపారవేత్తగానో లేక ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగానే కాదు ఎంతో మందికి రోల్ మోడల్, స్ఫూర్తిదాయకం కూడా.  తన టాటా గ్రూప్ లోని చిన్న ఉద్యోగిని  కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించేవాడు. అలాగే జంతువులన్నా, వీధికుక్కలన్నా చాలా ఇష్టం. టాటా ఎన్నో ఎన్జీవోలు, జంతు సంరక్షణ కేంద్రాలకు కూడా విరాళాలు ఇచ్చాడు. ముంబై 26/11 దాడి, కరోనా లాంటి మహమ్మారి సంభవించినప్పుడు తన వంతుగా సాయం అందించాడు.

TAGS