JAISW News Telugu

Ratan Tata : పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాలేదని  ప్రిన్స్‌ ఛార్లెస్‌ అవార్డు కార్యక్రమానికి వెళ్లని ‘రతన్‌ టాటా’

Ratan Tata

Ratan Tata pet dog

Ratan Tata : బ్రిటన్‌ను ఎక్కువ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II మరణించడంతో.. ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా నియమితులయ్యారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని అనుసరిస్తూ లండన్‌లోని చారిత్రాత్మక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అక్సెషన్ కౌన్సిల్ సమావేశమై ఆయనను రాజుగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో బ్రిటన్ రాజుగా ప్రిన్స్ చార్లెస్, రాణిగా ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్  అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన నెటిజన్లు, వ్యాపార దిగ్గజాలు బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్, దేశీయ దిగ్గజం రతన్ టాటాల స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పెంపుడు కుక్కల గురించి ప్రిన్స్ చార్లెస్‌తో రతన్ టాటా చేసిన సంభాషణలు ఆన్‌లైన్‌లో షేర్ విరివిగా షేర్ అయ్యాయి.

రతన్ టాటా దాతృత్వానికి గుర్తింపుగా, అతనికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించేందుకు ప్రిన్స్ చార్లెస్ లండన్ రాయల్ రెసిడెన్స్, బంకింగ్ హామ్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించ తలపెట్టారు. అయితే అవార్డుల ప్రదానోత్సవానికి రతన్ టాటా హాజరుకాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే రెండు పెంపుడు కుక్కలు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా..ఇది అక్షర సత్యం. అదే అవార్డుల వేడుకకు హాజరైన కాలమిస్ట్, వ్యాపారవేత్త సుహెల్ సేథ్ సోషల్ మీడియాతో తన తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతన్ టాటాపై ప్రశంసల వర్షం కురిపించాడు.

లండన్‌లోని రాయల్ రెసిడెన్సీ, బంఖామ్ ప్యాలెస్, రతన్ టాటాకు లైఫ్‌టైమ్ అవార్డును అందించడానికి సిద్ధంగా ఉంది. బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్ నిర్వహించిన ఈవెంట్ కోసం నేను 2018 ఫిబ్రవరి 2వ, 3వ తేదీల్లో లండన్ చేరుకున్నాను. లండన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత, టాటా నుండి దాదాపు 11 మిస్డ్ కాల్స్ రావడంతో నేను షాక్ అయ్యాను. వెంటనే నా బ్యాగులు తీసుకుని ఎయిర్‌పోర్టు బయటకు వస్తుండగా అతనికి ఫోన్ చేసాను. టాంగో, టిటో (రతన్ టాటా కుక్కలు) అనారోగ్యానికి గురయ్యాయి. తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. నేను వారిని వదిలి ఉండలేను,” అని సుహెల్ సేథ్ తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.

ప్రిన్స్ చార్లెస్ ఈవెంట్‌కి టాటా వచ్చేలా ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అతని అవార్డును అందుకోవడానికి టాటా హాజరుకాలేదు. ఈ సందర్భంగా అవార్డుల కార్యక్రమానికి రతన్ టాటా ఎందుకు రాలేదో తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మనసున్నా మారాజు, అది రతన్ టాటా’ అని ప్రిన్స్ చార్లెస్ అన్నారు.

Exit mobile version