Director Harish Shankar : రాసుకోండ్రా సాంబ.. ఇక మీ ఇష్టం : డైరెక్టర్ హరీష్ శంకర్

Director Harish Shankar

Director Harish Shankar

Director Harish Shankar : స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్  రవితేజ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన రెయిడ్ సినిమాకి ఇది రీమేక్. కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకొని  తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశామని డైరెక్టర్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.

పాటలు, ట్రైలర్లు విడుదలయ్యాక సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా హిట్ కొడతానని హరీష్ శంకర్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు హరీష్ శంకర్. తరచూ రీమేక్ లే చేస్తున్నారంటూ హరీష్ శంకర్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి హరీశ్ ను ప్రశ్నించారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళసూపర్ హిట్ మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారట.. ఈ ఆలోచన మీదేనా, లేకుంటే పవన్ కళ్యాణ్ దా  అని ప్రశ్నించారు.

దీనికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు హరీశ్ శంకర్. మాకు నచ్చిన కథని సినిమాగా తీస్తాం.. ప్రేక్షకులకి నచ్చితేనే హిట్టిస్తారు. లేకుంటే లేదు అని చెప్పడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. తెరి రీమేక్ ఆపమని సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేశారు. రెండు లక్షల మంది పోస్టులు పెట్టి తనపై దాడి చేశారని, తాను కూడా ఎక్కడా తగ్గలేదు. రీమేక్ గురించి ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ నేనెందుకు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. నచ్చితే చూస్తారు లేకుంటు లేదంటూ హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు.

ఇక  తన సినిమాకు రివ్యూలు ఎలాగైనా రాసుకోవచ్చని, నచ్చిన రేటింగ్‌లు కూడా ఇచ్చుకోవచ్చంటూ డైరెక్టర్ హరీశ్ శంకర్ సవాల్ విసిరారు. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ముఖాముఖిగా గొంతు ఎత్తినట్లు చెప్పారు. ‘ఇట్స్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ నాట్ ఆటిట్యూడ్’ అంటూ తనదైన స్టైల్ లో పంచ్ డైలాగ్ వేశారు. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్లు ఆగస్టు 14 సాయంత్రం నుంచే మొదలు కానున్నాయి.

TAGS