JAISW News Telugu

Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి..  త్వరలోనే పెళ్లి కూడా

FacebookXLinkedinWhatsapp
Rashmika

Rashmika

Rashmika Diwali : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఏదో నడుస్తుందంటూ ఎప్పటినుంచో పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి హాలిడే ట్రిప్పులు చేయడం, ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. రీసెంట్ గా దీపావళి సందర్భంగా రష్మిక విజయ్ ఇంట్లో పండగ జరుపుకుందన్న వార్త వైరల్ అవుతోంది. రష్మిక తన సోషల్ మీడియాలో దీపావళి ఫోటోలను పంచుకుంది.  తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపింది. రష్మిక ఇటీవల హైదరాబాద్‌లోనే ఉంటూ ఇక్కడ పండుగలు, ప్రత్యేక సందర్భాలను జరుపుకుంటుంది. విజయ్ కుటుంబంతో ఆమెకు బలమైన బంధం ఏర్పడిందని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లిక సమ్మతించాయని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వ్యాపిస్తున్నాయి.

ఒకానొక సందర్భంలో రష్మిక స్పందిస్తూ.. ‘మేము ఓకే ఫ్యామిలీ’ అని నవ్వుతూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఆనంద్ పేరును రష్మిక ప్రస్తావించడం  వారికి ఎక్కడికో సంకేతంలా అనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న సూచనలతోనే రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో హీరో, హీరోయిన్లు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Exit mobile version