JAISW News Telugu

Rashmika-Vijay : సీక్రెట్ ట్రిప్ లో మరోసారి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన రష్మిక – విజయ్ దేవరకొండ!

Rashmika-Vijay Devarakonda

Rashmika-Vijay Devarakonda secret trip

Rashmika-Vijay Devarakonda : టాలీవుడ్ లో చాలా కాలం నుండి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ప్రేమలో ఉన్నారని, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ వీళ్లిద్దరు మాత్రం ఈ విషయం పై బయటపడడం లేదు. ఇద్దరు కలిసి డిన్నర్లకు వెళ్తున్నారు, వరల్డ్ టూర్స్ కి పోతున్నారు, కలిసి ఒకే ఇంట్లో పండగ కూడా చేసుకుంటున్నారు కానీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అనే వార్తని మాత్రం చెప్పడం లేదు.

రీసెంట్ గా వీళ్లిద్దరికీ నిచితార్థం జరిగిపోయిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ సెన్సేషన్ సృష్టించింది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ టీం అలాంటిదేమి లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కానీ వీళ్ళు ఎంత దాచాలి అనుకున్నా నిజం దాగదు. ఎప్పటికైనా బయటపడాల్సిందే. వీళ్ళు కూడా అనేకసార్లు బయటపడ్డారు కానీ, ఎందుకో మా మధ్య ఏమి లేదంటూ బుకాయిస్తున్నారు.

గతం లో ఈ ప్రేమ జంట కలిసి మాల్దీవ్స్ ని చుట్టేసి వచ్చారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఈ ఇద్దరి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రేమ జంట కలిసి వియాత్నం కి వెళ్లినట్టుగా తెలుస్తుంది. వీళ్లిద్దరి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్టులను ఒక్కసారి గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఇద్దరు కలిసి ఒకే ఫోటో దిగలేదు కానీ, వేర్వేరు ఫోటోలను చూస్తే ఒకే ప్రాంతం లో ఉన్నారనే విషయం అర్థం అవుతుంది. ఇలా ఇప్పటి వరకు వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని బయటపడిన ఆధారాలు లెక్కే లేదు. కానీ ఎందుకు ఇంకా ఇంత సీక్రెట్ గా రిలేషన్ ని మైంటైన్ చేస్తున్నారో, ఈ ఇరువురి తారల అభిమానులకు కూడా అర్థం కావడం లేదు.

ఇద్దరు కలిసి ప్రేమించుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ఈ రహస్య బంధం కొనసాగించడం లో ఆంతర్యం ఏమిటి అనేదే ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న. ఇక వీళ్లిద్దరి సినిమాల విషయానికి వస్తే, రష్మిక లేటెస్ట్ గా ‘ఎనిమల్’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, నటిగా తన సత్తా ఏంటో చూపించింది. ఇక విజయ్ దేవరకొండ వచ్చే నెల 18 వ తారీఖున ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

Exit mobile version