Rashmika:రష్మిక మందన్న పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?
Rashmika:రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మధ్య ప్రేమాయణం గురించి చాలా కాలంగా గుసగుసలు ఉన్నాయి. ఈ జోడీ తరచుగా ఈవెంట్‌లు విహారయాత్రలలో కలిసి కనిపిస్తున్నారు. మంచి స్నేహితులు మాత్రమేనని పేర్కొంటూనే రకరకాల ఊహాగానాలకు తావిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా యాక్టివిటీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రష్మిక మందన్న తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. `నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు` అని హార్ట్ ఈమోజీని .. దానితో పాటు వైట్-హార్ట్ ఎమోజిని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో ఎవరినీ ట్యాగ్ చేయకపోయినా నెటిజనులు మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యారు. అతడు ఎవరో కాదు.. విజయ్ దేవరకొండ అంటూ అతడి వైపు దృష్టి మళ్లించారు. చాలా కాలంగా ఈ జంట నడుమ డేటింగ్ పుకార్లు వైరల్ అయ్యాయి.
తరచుగా విహారయాత్రలతో పాటు, విలువైన సమయం కలిసి గడిపినప్పటికీ, విజయ్ – రష్మిక తమ రిలేషన్ ఎలాంటిదో వివరించలేదు. తమ స్నేహం డేటింగ్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ప్రస్తుతానికి అభిమానులు తారల నుండి ఏదైనా అధికారిక నిర్ధారణ లేదా తిరస్కరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.