Rashmika : పుష్ప2 ఫొటోల లీక్ పై రష్మిక అసహనం

Rashmika impatient over the leak of Pushpa 2 photos
Rashmika : అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా పుష్ప2 వస్తోంది. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప ఇప్పటికే బ్రహ్మాండమైన హిట్ గా నిలిచింది. పుష్ప 2 కూడా పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ కావడం తప్పనిసరని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో పుష్ప2కు సంబంధించిన ఫొటోలతో రష్మిక ఆందోళన వ్యక్తం చేస్తోంది.
షూటింగ్ నుంచి నటీనటుల లీక్ కావడంపై అసహనం వ్యక్తం చేస్తోంది. లీకైన ఫొటోలు షేర్ చేస్తూ సినిమాకు నష్టం కలిగిస్తున్నారని చెబుతోంది. సినిమాకు సంబంధించిన ఫొటోలు ముందే లీక్ చేస్తూ ఉంటే సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఇలా చేయడం సరైంది కాదు. సినిమా కోసం ఎంతో శ్రమిస్తుంటే ఇలా దొంగ చాటుగా ఫొటోలు షేర్ చేస్తే సినిమాపై అంచనాలు తప్పుతాయి. సినిమా ప్రైవసీకి భంగం కలిగించొద్దు.
సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఇలాంటి వ్యవహారాలు జరపడం మంచిది కాదు. వారికి బుద్ధి లేకుండా పోతోంది. పుష్ప2పై దర్శకుడు సుకుమార్ ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. వంద శాతం వినోదం పంచడమే మా ధ్యేయం. ఇలా మధ్యలో డిస్ట్రబ్ చేయడం వారి నైతికతకే మచ్చ తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పుష్ప2లో కూడా శ్రీవల్లిగా రష్మిక చేస్తోంది. బాక్సాఫీసు దగ్గర మంచి విజయం దక్కించుకోవాలని యూనిట్ అనుకుంటోంది. ఇందులో భాగంగానే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్పకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కింది. దేవీశ్రీ ప్రసాద్ కు కూడా ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు వచ్చింది. ఇలా పుష్ప2 కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు.