Rashmika Vijay Diwali celebrations : మళ్ళీ దొరికిపోయిన రష్మిక.. పెళ్లికి ముందే దేవరకొండతో కలిసి దివాళీ సెలెబ్రేషన్స్!

Rashmika Vijay Diwali celebrations

Rashmika Vijay Diwali celebrations

Rashmika Vijay Diwali celebrations : రష్మిక మందన్నా అంటే సౌత్ నుంచి నార్త్ దాకా పిచ్చ క్రేజ్ ఉన్న హీరోయిన్. టాలీవుడ్ లో ఆమె తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగిపోయింది. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు వరుసగా హిట్లు కొడుతూనే ఉంది. ఒక్కో సినిమాతో తానేంటూ నిరూపించుకుంది ఈ వయ్యారి భామ. ప్రతి సినిమాను మొదటి సినిమాగానే చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది.. ఇప్పటికే చేసిన సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ భామ కెరీర్ విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో  దేవరకొండతో ప్రేమాయణం స్టార్ట్ చేసినట్టు ఎప్పటి నుండో వార్తలు వైరల్ అవుతున్నాయి.. కానీ వీరు మాత్రం ఫ్రెండ్షిప్ అనే చెప్పుకుని తిరుగుతున్నారు.. అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ మాత్రం వీరు స్నేహితులు కాదు లవర్స్ అని కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా మరోసారి ఫ్యాన్స్ క్లూ కనిపెట్టారు.. దివాళీ సెలెబ్రేషన్స్ లో మరోసారి విజయ్, రష్మిక కలిసి చేసుకున్నట్టు పిక్స్ వైరల్ అయ్యాయి.. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి దీపావళీ సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు.. ఈ పిక్స్ ను నెట్టింట షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి..

రష్మిక కూడా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది.. రష్మిక సోషల్ మీడియా వేదికగా హ్యాపీ దీపావళీ అంటూ పిక్స్ షేర్ చేసిన కొద్దిసేపటికే విజయ్ కూడా ఫోటోలను పంచుకుంటూ హ్యాపీ దివాలీ అంటూ కామెంట్స్ చేసారు. ఈ రెండు ఫోటోలను కలిపి ఫ్యాన్స్ బ్యాక్ గ్రౌండ్ ఒకటే అని గుర్తు పట్టి అడ్డాగా బుక్ చేసారు. దీంతో మళ్ళీ వీరిద్దరూ లవర్స్ అని తేలిపోయింది. విజయ్ ఫ్యామిలీతో కలిసి ఈమె కూడా దీపావళీ జరుపుకుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TAGS