JAISW News Telugu

Rasabhasa : తొలిరోజున జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రసాభాస

Rasabhasa

Rasabhasa

Rasabhasa : ఆరేళ్ల తర్వాత ప్రారంభమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస చోటు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనీన బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని సీఎం తెలిపారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో సభ దద్దరిల్లింది. కాగా, అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ అటువంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు.

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంత ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. దీంతో పాటు ఆ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. ఒమర్ అబ్దుల్లా కూడా గత అయిదేళ్లుగా అందుకోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Exit mobile version