JAISW News Telugu

Rare Fish : జాలర్లకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతో తెలిస్తే షాకే

Rare Fish

Rare Fish

Rare Fish : చేపల్లో పలు రకాలుంటాయి. సముద్రంలో దొరికే చేపల్లో అరుదైన జాతికి చెందినవి కూడా ఉంటాయి. అవి దొరికినప్పుడు జాలర్ల పంట పండాల్సిందే. ఆ జాతుల్లో పులస నెంబర్ వన్. పులసకు ఎంత ధర అయినా చెల్లించి కొనుగోలు చేస్తారు. చేపలు మంచి పోషకాహారం. వీటిని తింటే ఏడు గంటల్లోనే జీర్ణం అయిపోతాయి. మటన్, చికెన్ లతో పోల్చుకుంటే చేపలు బెటర్ అని వైద్యులు సైతం చెబుతున్నారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు గోల్డెన్ ఫిష్ గా పిలిచే అరుదైన చేప జాతికి చెందిన కచిడి చేప సోమవారం (నవంబర్ 27)న దొరికింది. చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు పోటీపడ్డారు. చివరకు పూడికమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య రూ. 3.90 లక్షలు చెల్లించి సొంతం చేసుకోవడం విశేషం. ఇది దాదాపు 27 కిలోల బరువు ఉంది.

కచిడి చేప ఎప్పుడు దొరికినా భారీ మొత్తంలో అమ్ముడుపోవడం చూస్తుంటాం. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆపరేషన్ తరువాత వేసే కుట్లలో ఉపయోగించే దారం ఈ చేప గాల్ బ్లాడర్ తో తయారు చేస్తారు. మందుల తయారీలో కూడా దీని భాగాలు వినియోగిస్తారు. అరుదుగా దొరికే ఈ చేపను వేలంలో అమ్ముకోవడం జరుగుతుంది.

హర్యానాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్ పుర్ కు చెందిన ఓ ముర్రా జాతి గేదె రికార్డు ధరకు అమ్ముడుపోయింది. గేదె యజమాని రణవీర్ షియోరాన్ రూ. 4.60 లక్షలకు అమ్మాడు. దీంతో యజమాని పొంగిపోయాడు. దానికి నోట్లతో మాల వేసి వీడ్కోలు పలికాడు. ఇది రోజుకు 26 లీటర్ల పాలు ఇస్తుంది. దీన్ని వికాస్ అనే వ్యక్తి దగ్గర రూ.78 వేలకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం దాని వయసు ఆరేళ్లు.

Exit mobile version