Ranveer Singh : దీపికతో విడాకుల రూమర్లపై స్పందించిన రణవీర్ సింగ్.. అసలు సంగతి ఇదే
Ranveer Singh : సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ కెమిస్ట్రీ తో దీపికా పడుకొనే.. రణవీర్ సింగ్ అభిమానులను ఆకర్షిస్తుంటారు. అందుకే బాలీవుడ్ లో ఉన్న స్టార్ జంటలలో వీళ్లిద్దరికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు వీరిని ప్రేమగా దీప్‌వీర్ అని పిలుస్తుంటారు. అయితే గత కొంతకాలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడిపోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. త్వరలో దీపికా పడుకొనే..రణవీర్ సింగ్ తో విడాకులు కూడా తీసుకోబోతోంది అన్న వార్త వారి అభిమానులను కంగారులో పడేసింది. అందులో నిన్న రణవీర్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ లోని తన ఫోటోలను తీసేయడంతో ఈ రూమర్ మరింత బలం ఏర్పడినట్లు అయింది.
అయితే దీనిపై రణవీర్ సింగ్ పి ఆర్ టీం క్లారిటీ వచ్చింది. రణవీర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో..ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేకపోవడంతో.. అభిమానులు వీరు తప్పకుండా డివోర్స్ తీసుకుంటారంటూ నిన్నటి నుంచి కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏమిటంటే… 2023కు ముందు ఇన్స్టాగ్రామ్ అకౌంటులో చేసిన పోస్టులను రణవీర్ ఆర్చివ్ చేశారట. అందువల్లే అవి కనిపించడం లేదట. గతంలో దీపికా పదుకొనే సైతం ఓసారి ఈ విధంగా చేశారు. అయితే… ఇటువంటి అనుమానాలు రావడంతో ఆమె తర్వాత అన్ని పోస్టులను ఇన్‌స్టాలో ఉంచారు. ఆర్చివ్ చేయడం వల్ల పాత పోస్టులు కనిపించకుండా ఇన్‌స్టాకు కొత్త లుక్ వస్తుందని సెలబ్రిటీలు అప్పుడప్పుడూ అలా చేస్తారు.
ఈ విధంగా దీపిక రణవీర్ జంట తమ పుకార్లకు చెక్ పెట్టింది. దీపిక పడుకొనే, రన్వీర్ సింగ్ ఇప్పుడు ముంబైలోని తమ బిజీ బిజీ జీవితాల నుంచి చిన్న బ్రేక్ తీసుకొని.. వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరూ కలిసి సంతోషంగా వెకేషన్ కి వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల పరంగా ఈ మధ్యనే రాఖీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని అనే సినిమాతో రణవీర్ బ్లాక్ బస్టర్ అనుకున్నారు. మరోవైపు దీపిక పడుకొనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.