Pawan Kalyan : పవన్ కల్యాణ్ తో రంగమ్మత్త డ్యాన్స్.. ఫ్యాన్స్ కు పండగే ఇక

Pawan Kalyan and Anasuya
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ సినిమాల పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత హైప్ పెంచగా.. తాజాగా పవర్ స్టార్ అభిమానులకు యాంకర్ అనసూయ సర్ ప్రైజ్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన చేసే సినిమాలు అన్ని ఆగిపోయాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం.. పవన్ కల్యాణ్ బాగా బిజీ అయిపోయాడు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమైపోయాడు. దీంతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కొన్ని రోజులు షూటింగ్ లేట్ అవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు చెప్పాడు.
తాజాగా పవర్ స్టార్ అభిమానులకు యాంకర్ అనసూయ.. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షో లేటెస్ట్ ప్రోమోలో కొన్ని విషయాలు రివీల్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని.. ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ విషయం బయటపెట్టి రంగమ్మత్త షాక్ ఇచ్చింది. పవన్ సార్ తో నేను బ్యూటీఫుల్ డ్యాన్స్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుందని హింట్ ఇచ్చి సంచలనం సృష్టించింది. అయితే ఏ సినిమాలో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో ఇది కచ్చితంగా స్పెషల్ సాంగ్ అయి ఉంటుందని అనుకున్నారు.
గతంలోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ అనసూయ నటించి మెప్పించింది. ఇప్పుడు ఏకంగా పవన్ తో స్పెషల్ సాంగ్ చేయనుండడంతో పవన్ ఫ్యాన్స్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు హరిహర వీరమల్లు సినిమాల్లో యాక్ట్ చేస్తుండగా.. డిప్యూటీ సీఎం కావడంతో అవి మధ్యలోనే ఆగిపోయాయి.