JAISW News Telugu

Ranbir-Alia : 69 ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన రణబీర్ కపూర్ – అలియా భట్..!

FacebookXLinkedinWhatsapp
Ranbir Kapoor - Alia Bhatt at the 69th Filmfare Awards

Ranbir Kapoor and Alia Bhatt at the 69th Filmfare Awards

Ranbir Kapoor – Alia Bhatt : గత ఏడాది కి సంబంధించిన బాలీవుడ్ సినిమాలకు  ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని నిన్న ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో బాలీవుడ్ కొత్త జంట రణబీర్ కపూర్, అలియా భట్ సత్తా చాటారు. 2023 వ సంవత్సరం డిసెంబర్ 1 వ తారీఖున విడుదలైన రణబీర్ కపూర్ ‘ఎనిమల్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం లో రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ రెండు సార్లు వెయ్యి కోట్లు కొట్టినా కూడా పెర్ఫార్మన్స్ పరంగా అయితే రణబీర్ కపూర్ ది బెస్ట్ అనిపించాడు, అందుకే ఆయనకి ఉత్తమనటుడిగా ఎనిమల్ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.

ఇక గత ఏడాది రొమాంటిక్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని’ చిత్రం లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను రణబీర్ కపూర్ సతీమణి అలియా భట్ కి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఇక సినిమాల పరంగా చూస్తే గత ఏడాది క్రిటిక్స్ ని మెప్పించడమే కాకుండా, ప్రేక్షకుల అశేష ఆదరణ దక్కించుకున్న 12th  ఫెయిల్ చిత్రానికి అత్యధిక అవార్డులు దక్కాయి. 2023 వ సంవత్సరం కి గాను ఉత్తమ చిత్రం గా ఫిలిం ఫేర్ అవార్డు ని దక్కించుకున్న 12th ఫెయిల్ చిత్రం లో హీరో గా నటించిన విక్రాంత్ కి ఉత్తమ నటుడు క్రిటిక్స్ అవార్డు దక్కగా, షెఫాలీ షా కి త్రీ ఆఫ్ అస్ చిత్రానికి , అలాగే ‘మిస్టర్ ఛటర్జీ vs నార్వే’ చిత్రానికి గాను రాణి ముఖర్జీ లకు ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డు దక్కింది.

ఈ 69 వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్  కి కరణ్ జోహార్ మరియు ఆయుష్మాన్ ఖుర్రనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ఈవెంట్ లో కరీనా కపూర్, కరిష్మా కపూర్,  వరుణ్ ధావన్ మరియు కార్తీక్ ఆర్యన్ల ద్యాస పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణగా నిల్చింది. అతి త్వరలోనే ఈ ఈవెంట్ టీవీ లో టెలికాస్ట్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియనుంది.

Exit mobile version