JAISW News Telugu

New Demand : రూ.500 నోటుపై రాముడి బొమ్మ ముద్రించాల్సిందే..పుట్టుకొస్తున్న కొత్త డిమాండ్..

New Demand

New Demand, 500 note Jai Sri Ram

New Demand : భారత్ యావత్తూ ప్రస్తుతం అయోధ్య రామాలయం గురించే చర్చ నడుస్తోంది. రాములోరి ప్రాణప్రతిష్ఠకు మరో రెండు రోజులే ఉండడంతో ప్రతీ ఊరూ, వాడ అంతా రామమయం అయిపోతున్నాయి. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసినా రామాలయ విశేషాలు, కథనాలే వినపడుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ రోజు అది చేయాలి .. ఇది చేయాలి అంటూ కొందరు మెసేజ్ లు పెడుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ర్యాలీలు తీస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జనవరి 22న సెలవు ప్రకటించాయి. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ బాధ్యతలు ఆలయ ట్రస్ట్ కు అప్పగించింది.

అయోధ్య రామమందిర ప్రారంభ వేళ.. పలు డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను అయోమయంలో ముంచెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా శ్రీరాముడి బొమ్మ  ఉన్న రూ.500 నోటు చక్కర్లు కొడుతుంది. ఏంటీ కేంద్ర ప్రభుత్వం నోటును రిలీజ్ చేసిందా? అసలు ఆ నోటు చెల్లుతుందా? పాతది రద్దు చేశారా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అనుమానం వస్తోంది. అయితే ఇది కొందరు రామభక్తులు చేసిన పని అని తెలుస్తోంది. ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సదరు వ్యక్తులు ఆ నోటును వైరల్ చేస్తున్నారు. ఇక దీన్ని తమకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తూ జై శ్రీరామ్ అని కామెంట్ పెడుతున్నారు.

ఈ నోటు ఇలా వైరల్ కావడంతో బీజేపీ నేతలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. భారత కరెన్సీపై రాముడి బొమ్మ ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈవిషయంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ రూ.500 నోటుపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇది తన ఒక్కడి డిమాండ్ కాదని..100 కోట్ల మంది హిందువుల అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికా, థాయ్ లాండ్, ఇండోనేషియా వంటి దేశాల కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫొటోలు ముద్రించుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇండియాలో 80 శాతానికి పైగా హిందువులు ఉన్నారని, వారి మనోభావాలకు అనుగుణంగా  కరెన్సీ నోట్లపై రాముడి బొమ్మ ఎందుకు ముద్రించకూడదని అంటున్నారు.

Exit mobile version