Ramoji Rao – NTR : రామోజీ రావు అంటే ఎన్టీఆర్ కు ఎంత అభిమానమో.. వీడియో

Ramoji Rao - NTR

Ramoji Rao – NTR

Ramoji Rao – NTR :  మీడియా మొఘల్ రామోజీరావు హస్తమయంతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. మహోన్నత వ్యక్తిగా, దర్శనికుడిగా ఎదిగిన ఆయన జీవితం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకం. మీడియా ఎలా ఉండాలి, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కష్టాలు, నష్టాలు ప్రభుత్వానికి ఎలా వివరించాలి అని ‘ఈనాడు’ ద్వారా చెప్పిన కలం స్నేహితుడు రామోజీరావు. విశాఖ కేంద్రంగా వచ్చిన ‘ఈనాడు’ అంచలంచెలుగా ఎదిగింది. తెలుగు మీడియా రంగం నేడు దేశ వ్యాప్తంగా కీర్తించబడుతుందంటే అందుకు కారణం రామోజీరావే.

రామోజీరావు అంటే యుగ పురుషుడు నందమూరి తారక రామారావుకు కూడా అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్ ఎదుగుదలలో, ఆయన కీర్తిని దశ, దిశలా చాటడంలో రామోజీరావు పాత్ర గొప్పదనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉండగా ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈనాడు. ఎప్పుడూ ప్రజల పక్షాణ నిలబడే పత్రికగా ఈనాడుకు చాలా విలువ ఇచ్చేవారు ఎన్టీఆర్. అప్పటికే మీడియా రంగంలో రామోజీరావు పోషించే పాత్రను కీర్తించిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే.

ఎన్టీఆర్, రామోజీరావు మధ్య మంచి స్నేహం ఉండేది. అది పాలనా పరంగా కావచ్చు, వ్యక్తిత్వ పరంగా కావచ్చు. మచ్చలేని మహా మనిషి రామోజీరావు. గతంలో కొంత మంది సీఎంలు మార్గదర్శిని లేకుండా చేయాలని ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన బాధను పంటికింద బిగబెట్టుకున్నారే తప్ప రచ్చకెక్కలేదు. అంతిమంగా న్యాయం గెలుస్తుందని నమ్మిన రామోజీరావు ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. ఫలితంగా ఆయనపై అన్నీ ఆరోపణలేనని తేలిపోయింది.

రామోజీరావు అంటే ఎన్టీఆర్ కు ఎంత అభిమానం ఉందో ఈ వీడియోలో తెలుస్తుంది. 

TAGS