Chandrababu : రామోజీ రావు అంతిమ యాత్రలో చంద్రబాబు.. పాడె మోస్తూ కన్నీరు..
Chandrababu : మీడియా మొఘల్ రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని సైతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయన ఉన్నారన్న ధైర్యమే చాలా మందిలో ఉండేది. ఈనాడు గ్రూప్స్ ను ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు. తను నమ్ముకున్న విలువల కోసం నిరంతరం శ్రమించారాయన. కొన్ని మీడియా సంస్థలు తమ స్వలాభం కోసం దిగజారిన సందర్భంలో కూడా డబ్బులు శాశ్వతం కాదని, కీర్తి మాత్రమే నిలుస్తుందని చెప్పిన ఆయన మీడియాను దేవుడి కన్నా పవిత్రంగా భావించేవారు.
ఆయన పత్రికలో అండర్ వేర్ యాడ్స్ కూడా వేయలేదంటే ఆయనకు దానిపై ఉన్న భక్తి శ్రద్ధలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి రామోజీరావు మరణం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ సాధక, బాధకాల్లో ఎంతో కొంత పాత్ర పోషించిన ఈనాడు అంటే చంద్రబాబు నాయుడికి కూడా ప్రీతిపాత్రమే. అందుకే రామోజీరావు మరణాన్ని తట్టుకోలేకపోయాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు పాత్ర కీలకం అని తెలిసినా.. వాటిని వేగంగా పూర్తి చేసుకొని తెలంగాణకు చేరుకున్నారు.
రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమ వీడ్కోలు పలికారు. పాడెను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. కాట్నం చుట్టూ తిరుగుతూ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు ప్రముఖులు సైతం రామోజీ పాడెను మోసీ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉండి తుది వీడ్కోలు పలికారు.