DSP Gangadhar : ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు జీవితం ఎందరికో ప్రేరణనిచ్చింది. ఆయన నెలకొల్పిన ‘ఈనాడు’ పత్రిక పేపర్ బాయ్ గా పనిచేసిన వారు ఎందరో ప్రస్తుతం మంచి హోదాలో ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన మధనం గంగాధర్. ఆయన 1991 నుంచి 1995 వరకు ఈనాడు పేపర్ బాయ్ గా పనిచేశారు. రామోజీరావు కు సంబంధించిన వాస్తవ విషయాలు చదువుతుంటే తనకు పేపర్ బాయ్ గా పనిచేసిన బాల్య జీవితం గుర్తుకు వస్తుందని ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న మధనం గంగాధర్ తెలిపారు.
ఆనాటి పేపర్ బాయ్ జీవితం తనకు జీవితంలో మార్గ నిర్దేశనం చేసిందని, ఉన్నత విద్య పట్ల అవగాహన, లక్ష్యం పట్ల స్పష్టతనిచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను డీఎస్పీ హోదాలో ఉన్న నా జీవితానికి పునాది వేసిందని గంగాధర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.